సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!

- July 07, 2026 , by Maagulf
సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!

రియాద్:సౌదీ అరేబియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ (డిజిటల్ ఎకానమీ) పరిమాణం, ప్రభావాన్ని అంచనా వేసేందుకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) ప్రత్యేక సర్వేను ప్రారంభించింది. డిజిటల్ సాంకేతికతలను ఆధారంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలను గుర్తించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపింది. ఈ సర్వే ద్వారా డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక వసతులు, డిజిటల్ సేవలు, డేటా వంటి అంశాలపై అధికంగా ఆధారపడే సంస్థలను గుర్తించనున్నారు. అలాగే డిజిటల్ వనరుల వినియోగంతో తమ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్న సంస్థల వివరాలను కూడా సేకరించనున్నారు.సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాల్లో వివిధ ఆర్థిక రంగాలకు చెందిన ప్రతినిధి సంస్థల నుంచి ఈ సర్వే ద్వారా సమాచారాన్ని సేకరిస్తామని GASTAT వెల్లడించింది.

డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర డేటాబేస్ ఆధారంగా డిజిటల్ ఎకానమీపై అధ్యయనాలు, గణాంక సూచీలు (ఇండికేటర్లు) అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుందని పేర్కొంది. అదేవిధంగా పరిశోధకులు, విద్యావేత్తలు, విశ్లేషకులు మరియు ఇతర భాగస్వాములకు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించేందుకు అవసరమైన విశ్వసనీయ డేటా సమాచారాన్ని అందించడం కూడా ఈ సర్వే లక్ష్యాల్లో ఒకటని తెలిపింది.  సర్వే ద్వారా లభించే డేటా ప్రభుత్వ విధాన రూపకల్పన, నిర్ణయాల ప్రక్రియలో కీలకంగా ఉపయోగపడుతుందని GASTAT తెలిపింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించడంలోనూ సహాయపడుతుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com