కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- July 07, 2026
కువైట్: పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పే లక్ష్యంతో కువైట్ మున్సిపాలిటీ "హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ ఎ క్లీన్ ఎన్విరాన్మెంట్" పేరుతో నెల రోజులపాటు ప్రత్యేక క్లీనింగ్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం జూలై నెల మొత్తం కొనసాగనుంది. కువైట్ వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నాయి.
పబ్లిక్ హైజీన్ మరియు రోడ్ ఆక్యుపెన్సీ విభాగాల ఫీల్డ్ బృందాలు నివాస ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడతాయి. పరిశుభ్రత సేవల నాణ్యతను పరిశీలించడంతో పాటు శుభ్రత పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు, కంపెనీల పనితీరును సమీక్షిస్తాయి. ప్రజా పరిశుభ్రత, రహదారి ఆక్రమణలకు సంబంధించిన నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నదానిపై కూడా అధికారులు సమీక్షిస్తారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో నిర్లక్ష్యంగా వదిలేసిన వాహనాలు, పడవలు, స్క్రాప్ సామగ్రి మరియు రాకపోకలకు ఆటంకం కలిగించే ఇతర వస్తువులను తొలగించనున్నారు. అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపాలిటీ స్పష్టం చేసింది. అలాగే నివాస ప్రాంతాలలో ఆక్రమణలను తొలగిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







