మహిళ దుస్తులు ధరించి తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల పట్టివేత

- August 12, 2016 , by Maagulf
మహిళ దుస్తులు ధరించి తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల పట్టివేత

జెడ:  బురైదః లోని  ఒక షాపింగ్ మాల్ లో  బురఖా  ధరించి మహిళల వేషంలో  సంచరిస్తున్న  బుధవారం  సాయంత్రం ఇద్దరు యువకులని పోలీసులు అరెస్టు చేశారు.

తమ దుకాణంలో ఇద్దరు అనుమానిత వ్యక్తులు ఆడవారి వేషంలో వయ్యారాలు పోతూ, కొనుగోలు చేసేవారి మాదిరిగా హడావిడి చేస్తున్నారని పోలీసులకు దుకాణ యజమాని సమాచారం ఇచ్చారు. ఆడ వేషంలో ఉన్న ఈ  ఇద్దరు యువకులు చక్కని మేకప్ తో, ఆడవారి అలంకరణతో వారిని ఎవరూ గుర్తించకుండా  బురఖా చాటున తమ తమ మొఖాలను దాచుకొని తమ షాప్ లో తిరుగుతున్నారని పోలీసులకు దుకాణ నిర్వాహకులు తెలిపారు. వారు తమ  షాపింగ్ ముగించుకొని యొక్క మసీదు సెంటర్ కు  రాగానే  అల్ ఖ్అస్సిమ్  పోలీసులు వీరిని అరెస్టు చేశారు.ఈ ఇరువురు పురుషులు సౌదీ జాతీయులని..  వారి వయస్సు 20 ఏళ్ళ లోపు  ఉంటుందని పోలీసులు  చెప్పారు. ఆ ఇద్దరు నేర పరిశోధన మరియు ప్రాసిక్యూషన్ బ్యూరో అధికారులకు పోలీసులు అప్పగించారు . 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com