ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- July 08, 2026
దోహా: హోర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న ఖతార్ ట్యాంకర్ అల్ రెకయ్యాత్ను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖతార్ దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అంతర్జాతీయ నౌకాయాన భద్రతను తీవ్రంగా ఉల్లంఘించడమే కాక, ప్రపంచ ఇంధన సరఫరా భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా అభివర్ణించింది. ఈ మేరకు ఖతార్ దేశంలోని ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ మోహ్సెన్ మొహమ్మద్ ఘనీకి విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ హెచ్ఈ ఇబ్రహీం నిరసన తెలియజేస్తూ.. మెమోను జారీచేశారు.
ఇరాన్ దాడి అంతర్జాతీయ నౌకాయాన భద్రతకు మరియు ప్రాంతీయ స్థిరత్వానికిముప్పు కలిగిస్తుందని పేర్కొంది. అంతర్జాతీయ నౌకాయానానికి మరియు ప్రపంచ ఇంధన సరఫరాలకు ప్రమాదం కలిగించకుండా ఉండాలని ఖతార్ డిమాండ్ చేసింది. ఈ దాడికి తక్షణ వివరణ ఇవ్వాలని, ఇది పునరావృతం కాకుండా నిరోధించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, అంతర్జాతీయ చట్టంలోని సంబంధిత నిబంధనలను పూర్తిగా పాటించాలని ఇరాన్‌కు ఖతర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







