కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్‌మెంట్
- July 07, 2026
దుబాయ్: తెలుగు యువ పారిశ్రామికవేత్త రఘునాథ్ రప్పిన్ స్థాపించిన కార్వ్ ఐటీ కన్సల్టెన్సీ ఎఫ్‌జెడ్-ఎల్‌ఎల్‌సీ సంస్థకు 4 మిలియన్ అమెరికన్ డాలర్ల అంతర్జాతీయ పెట్టుబడి కమిట్‌మెంట్ లభించింది. దుబాయ్‌లో నిర్వహించిన ఐసీఐఈ (ICIE) డీల్ రూమ్ కార్యక్రమంలో ఈ పెట్టుబడి వివరాలను అధికారికంగా ప్రకటించారు.
రాస్ అల్ ఖైమా ఎకనామిక్ జోన్ (RAKEZ)లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్వ్ సంస్థ ఆరోగ్య సాంకేతిక (హెల్త్‌టెక్) రంగంలో వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తోంది. ఈ కార్యక్రమంలో రాకెజ్ ప్రతినిధులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఎమిరాతీ వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, ఆవిష్కరణ రంగ నిపుణులు పాల్గొన్నారు.
రఘునాథ్ రప్పిన్ గత రెండేళ్లుగా తన వ్యాపార ఆలోచనను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తుండగా, ఐసీఐఈ ఛైర్మన్ సందీప్ మక్తల మార్గదర్శకత్వం కీలక మలుపు తీసుకువచ్చిందని కార్యక్రమంలో వెల్లడించారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన "ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్" అంతర్జాతీయ వ్యాపార పర్యటనల ద్వారా రఘునాథ్ సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో ప్రభుత్వ సంస్థలు, ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, ఆవిష్కరణ కేంద్రాలతో పరిచయాలు ఏర్పరచుకున్నారు.
వ్యాపార ప్రణాళిక రూపకల్పన, పెట్టుబడిదారుల ముందు ప్రెజెంటేషన్, వ్యాపార ప్రతిపాదనను మరింత బలోపేతం చేయడం, అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను విస్తరించడం వంటి అంశాల్లో సందీప్ మక్తల అందించిన మార్గదర్శకత్వం కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సహకారంతో కేవలం 30 రోజుల వ్యవధిలోనే కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల పెట్టుబడి కమిట్‌మెంట్ లభించడం విశేషమని తెలిపారు.
ఈ సందర్భంగా రఘునాథ్ రప్పిన్ మాట్లాడుతూ, రెండేళ్లుగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సందీప్ మక్తల మార్గదర్శకత్వం లభించిన తర్వాతే తన ప్రయాణం కొత్త దిశలో సాగిందన్నారు. ప్రపంచ స్థాయి వేదికలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులతో పరిచయాలు కల్పించడం ద్వారా తన ఆలోచనను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం దక్కిందని తెలిపారు. ఈ పెట్టుబడి తనపై ఉంచిన విశ్వాసానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని అన్నారు.
ఐసీఐఈ ఛైర్మన్ సందీప్ మక్తల మాట్లాడుతూ, భారతీయ యువ పారిశ్రామికవేత్తలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. సరైన మార్గదర్శకత్వం, సరైన వేదిక, సరైన నెట్‌వర్క్ లభిస్తే భారతీయ యువత ప్రపంచ స్థాయిలో గొప్ప విజయాలు సాధించగలరని రఘునాథ్ రప్పిన్ విజయం మరోసారి నిరూపించిందన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఈ పెట్టుబడి కమిట్‌మెంట్‌ను కార్వ్ సంస్థ ప్రపంచ వ్యాపార విస్తరణలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆశించే తెలుగు యువ పారిశ్రామికవేత్తలకు ఈ విజయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







