కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA

- July 08, 2026 , by Maagulf
కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA

మనామా: ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తన కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ ను డిజిటలైజ్ చేసింది. దీని ద్వారా పరిశ్రమల మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వారి వాణిజ్య రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిన వెంటనే, లైసెన్స్ హోల్డర్లు తమ కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్‌ను ఆటోమెటిక్ గ రద్దు చేసుకోవచ్చు. దీంతో ప్రాసెసింగ్ టైమ్ రెండు రోజుల నుంచి రియల్ టైమ్ కు తగ్గిపోతుందని LMRA సర్వీసెస్ మరియు బిజినెస్ అఫైర్స్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అహ్మద్ ఇబ్రహీం అల్ అరది తెలిపారు.  

ప్రభుత్వ సేవలను అభివృద్ధి చేయడానికి బహ్రెయిన్ ప్రభుత్వం చేపట్టిన విస్తృత కార్యక్రమంలో ఇది కూడా ఒక భాగమన్నారు.జాతీయ ఫిర్యాదుల వ్యవస్థ అయిన తవాసుల్, పెట్టుబడిదారుల అభిప్రాయాలు మరియు ప్రభుత్వ సీక్రెట్ షాపర్ నివేదికల ద్వారా అందిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ మేరకు కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com