'మన ఊరి రామాయణం' ట్రైలర్ విడుదల

- August 12, 2016 , by Maagulf
'మన ఊరి రామాయణం' ట్రైలర్ విడుదల

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ లీడ్ రోల్‌లో నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం 'మన ఊరి రామాయణం'. ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది. మా కల అందరికీ నచ్చుతుందని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేసిన ప్రకాశ్‌రాజ్..మూవీ ట్రైలర్‌ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్నందిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com