ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- July 10, 2026
అబుదాబి: ఎతిహాద్ రైలు ప్రయాణికులకు మరో బంపరాఫర్ ప్రకటించారు. తక్కువ ధరల్లో రైలు ప్రయాణం మాత్రమే కాకుండా, ఫుజైరాలోని పలు ప్రముఖ హోటళ్లలో బస, భోజనం, స్పా సేవలు తదితర సౌకర్యాలపై 25 శాతం వరకు ప్రత్యేక తగ్గింపులు పొందే అవకాశం కల్పించారు. ఎతిహాద్ రైలు ప్రయాణికుల సేవల తొలి దశ ప్రారంభాన్ని పురస్కరించుకుని ఫుజైరా టూరిజం ఈ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. చెల్లుబాటు అయ్యే ఎతిహాద్ రైలు టికెట్‌ను హోటల్లో చూపిస్తే ప్రయాణికులు ఈ రాయితీలను పొందవచ్చు.
అబుదాబి–ఫుజైరా మార్గంలో ఎతిహాద్ రైలు కంఫర్ట్ క్లాస్ టికెట్ ధర Dh55, ప్రీమియం క్లాస్ టికెట్ ధర Dh120గా నిర్ణయించింది. ఈ టికెట్‌తో ఎంపిక చేసిన హోటళ్లలో గది బుకింగ్‌లు, రెస్టారెంట్లలో భోజనం, స్పా చికిత్సలు, బీచ్, స్విమ్మింగ్ పూల్ వంటి వినోద సౌకర్యాలపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. కొన్ని హోటళ్లు గది అప్‌గ్రేడ్, ముందస్తు చెక్-ఇన్, ఆలస్యంగా చెక్-అవుట్ వంటి అదనపు సదుపాయాలను కూడా అందిస్తున్నాయి.
అందుబాటులో ఉన్న ప్రయోజనాలు
హోటల్‌ను బట్టి ప్రయాణికులు పలు సదుపాయాలపై ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చు.
* హోటల్ గదులపై 10% నుంచి 25% వరకు తగ్గింపు
* రెస్టారెంట్లలో భోజనం, పానీయాలపై తగ్గింపు
* స్పా చికిత్సలపై ప్రత్యేక రాయితీలు
* గది అప్‌గ్రేడ్ (లభ్యత ఆధారంగా)
* ముందస్తు చెక్-ఇన్, ఆలస్యంగా చెక్-అవుట్
* బీచ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, జకుజీ, సౌనా వంటి సౌకర్యాలకు ప్రత్యేక ప్రవేశం
ప్రధాన హోటళ్ల ఆఫర్లు
Le Méridien Al Aqah Beach Resort Fujairah
* బ్రేక్‌ఫాస్ట్‌తో కూడిన బసపై 25% తగ్గింపు
* ఆహారం, పానీయాలు, స్పా చికిత్సలపై 25% తగ్గింపు
InterContinental Fujairah Resort
* గదుల బుకింగ్‌పై 25% తగ్గింపు
* ఆహారం, పానీయాలపై 25% తగ్గింపు
Radisson Blu Resort
* గదుల బుకింగ్‌పై 25% తగ్గింపు
* ఫుడ్ & బేవరేజెస్‌పై 25% తగ్గింపు
City Tower Hotel
* గదుల బుకింగ్‌పై 25% తగ్గింపు
* మధ్యాహ్న, రాత్రి భోజనంతో పాటు హోటల్ సౌకర్యాలపై 25% తగ్గింపు
DoubleTree by Hilton Fujairah City
* గదులపై 20% తగ్గింపు
* 12 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలకు ఉచిత బస, భోజనం (ఎంపిక చేసిన గదుల్లో)
* ఫుడ్ & బేవరేజెస్, స్పాపై 20% తగ్గింపు
* గది అప్‌గ్రేడ్, ముందస్తు చెక్-ఇన్, ఆలస్యంగా చెక్-అవుట్ (లభ్యత ఆధారంగా)
Al Bahar Hotel & Resort
* గదులు, ఫుడ్ & బేవరేజెస్‌పై 20% తగ్గింపు
* పూల్, బీచ్ యాక్సెస్‌పై ప్రత్యేక ఆఫర్లు
* ఈ ఆఫర్ 2026 ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటుంది
Royal M Hotel by Gewan Fujairah
* గదులపై 15% తగ్గింపు
* మధ్యాహ్న, రాత్రి భోజనంపై 20% తగ్గింపు
* బస చేసే అతిథులకు పూల్, జిమ్, జకుజీ, సౌనా ఉచితం
* వాక్-ఇన్ ఎతిహాద్ రైలు ప్రయాణికులకు హోటల్ సౌకర్యాలపై 20% తగ్గింపు
Fairmont Fujairah Beach Resort
* గదులపై 15% తగ్గింపు
* మధ్యాహ్న, రాత్రి భోజనంపై 15% తగ్గింపు
Fujairah Rotana Resort & Spa
* గదులు, భోజనం, హోటల్ సౌకర్యాలపై 20% తగ్గింపు
Miramar Al Aqah Beach Hotel & Resort
* గదులపై 10% తగ్గింపు
* ఫుడ్ & బేవరేజెస్‌పై 10% తగ్గింపు
Dibba Mountain Park Resort
* గదులపై 20% తగ్గింపు
* ఫుడ్ & బేవరేజెస్‌పై 15% తగ్గింపు
Mirage Bab Al Bahr Hotel
* గదులపై 25% తగ్గింపు
* (ప్రభుత్వ సెలవు రోజుల్లో వర్తించదు)
Royal Beach Hotel & Resort
* గదులపై 10% తగ్గింపు
* ఫుడ్ & బేవరేజెస్‌పై 10% తగ్గింపు
ఫుజైరాను సందర్శించే ఎతిహాద్ రైలు ప్రయాణికులు.. చెల్లుబాటు అయ్యే ఎతిహాద్ రైలు టికెట్ చూపించి ఈ ప్రత్యేక రాయితీలను పొందవచ్చు.
తాజా వార్తలు
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం







