కోలీవుడ్‌కు శుభవార్త!
- August 12, 2016
కోలీవుడ్‌కు శుభవార్త! త్వరలోనే సినీ పరిశ్రమకు ప్రభుత్వ అవార్డులు అందనున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా డీఎంకే ఎమ్మెల్యే, నటుడు వైగై చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా సినీపరిశ్రమకు ప్రభుత్వ అవార్డులు లేకుండాపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలోకి జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ... త్వరలోనే భారీగా ఉత్సవం నిర్వహించి సినీ పరిశ్రమకు ఆరేళ్లకు సంబంధించిన అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. నటీనటులతో పాటు, టెక్నీషియన్లకు కూడా అవార్డులు ఇస్తామన్నారు. అంతేగాక బుల్లితెర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులు ఇస్తామన్నారు. గత డీఎంకే ప్రభుత్వం మూడేళ్లపాటు పోలీసులకు అవార్డులు ఇవ్వకుండా నిలిపేసిందని విమర్శిస్తూ.. తాను అధికారంలోకి రాగానే పోలీసుశాఖకు మెడల్స్ బహూకరించానన్నారు. తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని సీఎం వివరించారు. అమ్మా! కృతజ్ఞతలు: నడిగర్ సంఘం సినీ పరిశ్రమకు త్వరలోనే అవార్డులు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జయలలితకు నడిగర్ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, ఉపాధ్యక్షుడు పొనవన్నన శుక్రవారం సాయంత్రం నగరంలో విలేఖరులతో మాట్లాడుతూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సంఘం కోసం నిర్మితమవుతున్న భవనాన్ని ప్రారంభించబోతున్నారని, అదే విధంగా ఇప్పుడు అవార్డులు ప్రకటించినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







