హైదరాబాద్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల జట్లు శుభారంభం
- August 13, 2016
తెలంగాణ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న అంతర జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. సికింద్రాబాద్‌లోని పల్లవి మోడల్ స్కూల్‌లో శుక్రవారం పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 15-5, 15-8తో మెదక్ జట్టుపై విజయం సాధించగా... మహిళల విభాగంలో హైదరాబాద్ జట్టు 15-3, 15-2తో కరీంనగర్ జట్టును చిత్తుగా ఓడించింది. పురుషుల విభాగంలో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో రంగారెడ్డి జట్టు 15-6, 15-4తో కరీంనగర్‌పై, ఆదిలాబాద్ జట్టు 15-8, 15-6తో మహబూబ్‌నగర్‌పై, హైదరాబాద్ 15-5, 15-12తో నిజామాబాద్‌పై, రంగారెడ్డి 15-8, 15-13తో ఖమ్మంపై, వరంగల్ 15-8, 15-11తో నల్లగొండపై గెలుపొందాయి. మహిళల విభాగంలో రంగారెడ్డి జట్టు 15-07, 15-04తో మెదక్‌పై, వరంగల్ జట్టు 15-09, 04-15, 15-11తో నల్లగొండపై, ఆదిలాబాద్ జట్టు 15-05, 15-07తో మహబూబ్‌నగర్‌పై, హైదరాబాద్ జట్టు 15-04, 15-02తో నిజామాబాద్ జట్లపై నె గ్గాయి. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పద్మారావు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే కనికారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర త్రోబాల్ సంఘం కార్యదర్శి జగన్ మోహన్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ మల్క కొమురయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







