ఎన్టీయార్‌ అభిమానులకు సారీ చెబుతూ ఓ వీడియో బైట్‌ : మోహన్‌లాల్‌

- August 13, 2016 , by Maagulf
ఎన్టీయార్‌ అభిమానులకు సారీ చెబుతూ ఓ వీడియో బైట్‌ : మోహన్‌లాల్‌

ఒక్క మలయాళంలోనే కాదు.. సౌత్‌ సినిమా ఇండస్ట్రీలోనే ఆయన ఓ టాప్‌ సూపర్‌ స్టార్‌. అయినా ఎన్టీయార్‌, కొరటాల శివ అడగ్గానే 'జనతా గ్యారేజ్‌'లో ఓ రోల్‌ చేసేందుకు అంగీకరించారు. అలాంటి స్టార్‌ హీరో ఎన్టీయార్‌ అభిమానులకు ఓ విషయంలో సారీ చెప్పారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో 'జనతా గ్యారేజ్‌' ఆడియో విడుదల శుక్రవారం నాడు వైభవంగా జరిగింది. ఈ సినిమాలో నటించిన అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే అనారోగ్యం కారణంగా సమంత.. బిజీగా ఉండడం వల్ల మోహన్‌లాల్‌ ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. అందుకే ఎన్టీయార్‌ అభిమానులకు సారీ చెబుతూ ఓ వీడియో బైట్‌ పంపారు మోహన్‌లాల్‌. 'ఫంక్షన్‌కు రావడానికి వీలైనంత వరకు ట్రై చేశాను. కానీ బిజీ షెడ్యూళ్ల వల్ల కుదరలేదు. ఎన్టీయార్‌ అభిమానులందరికీ సారీ. కేరళలో జరిగే ఓనం పండగ సందర్భంగా మా జనతాగ్యారేజ్‌ విడుదలవడం ఆనందంగా ఉంది. ఎన్టీయార్‌ ఈజ్‌ మై లవబుల్‌ బ్రదర్‌' అని ఆ వీడియోలో చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com