కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్‌పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!

- July 14, 2026 , by Maagulf
కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్‌పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!

షార్జా: తనతో పాటు భార్య, కుమార్తె పుట్టిన తేదీలను లాటరీ నంబర్లుగా ఎంచుకున్న భారతీయ ప్రవాసి యూఏఈ లాటరీలో ఏకంగా 30 మిలియన్ దిర్హమ్‌ల (Dh30 million) గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్నాడు. కేరళకు చెందిన 52 ఏళ్ల సునీల్ కుమార్ సదాశివన్ యూఏఈలో మెయింటెనెన్స్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ముందుగా కుమార్తె పుట్టిన తేదీ, తర్వాత తనది, ఆపై భార్య పుట్టిన తేదీని లాటరీ నంబర్లుగా ఎంచుకున్నానని చెప్పారు.

ఇటీవలే ఓ స్నేహితుడితో కలిసి లాటరీ టికెట్లు కొనడం ప్రారంభించిన సునీల్.. మొదటి టికెట్‌కు 100 దిర్హమ్‌లు గెలుచుకున్నారు. దీంతో ఉత్సాహంగా మరో డ్రాకు టికెట్ కొనగా, అదృష్టం కలిసి వచ్చి 30 మిలియన్ దిర్హమ్‌ల జాక్‌పాట్ దక్కింది. సునీల్ దంపతులకు 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత కుమార్తె జన్మించింది. ఆ కారణంగా కుమార్తె పుట్టిన తేదీ తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైందని ఆయన చెప్పారు. డ్రా ముగిసిన తర్వాత రాత్రి ఇంటికి చేరుకుని ఫోన్‌లో ఫలితాలు చూసినప్పుడు తాను షాక్‌కు గురయ్యానని, నమ్మలేక ముందుగా స్నేహితుడికి టికెట్ చూపించి, ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పానని సునీల్ వెల్లడించారు.

వచ్చిన నగదుతో ముందుగా తన కుమార్తెకు ఒక మంచి బహుమతి కొనిస్తానని, నిర్మాణంలో ఉన్న ఇంటిని పూర్తి చేస్తానని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నానని, ఇక కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు.అంతేకాకుండా, ఇళ్లు లేని కొంతమందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే కోరిక కూడా ఉందని ఆయన వెల్లడించారు.
కాగా, యూఏఈ లాటరీ ‘లక్కీ డే డ్రా’ ప్రతి బుధవారం, శనివారం రాత్రి 9:30 గంటలకు నిర్వహిస్తారు. ఇందులో 30 మిలియన్ దిర్హమ్‌ల గ్రాండ్ ప్రైజ్, 5 మిలియన్ దిర్హమ్‌ల రెండో బహుమతి, అలాగే మూడు 50,000 దిర్హమ్‌ల ‘లక్కీ ఛాన్స్’ బహుమతులు అందజేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com