ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!

- July 14, 2026 , by Maagulf
ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!

దోహా: దేశ గౌరవనీయ నాయకుడు, హిజ్ హైనెస్ ఫాదర్ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాప సూచకంగా ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సంతాప దినాల సందర్భంగా కూడా తమ ఎలక్ట్రానిక్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూలై 13 నుంచి నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ సందర్భంగా అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయని, మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా 24 గంటల పాటు, వారంలో ఏడు రోజులు పౌరులు మరియు నివాసితులు తమ లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com