కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- July 14, 2026
హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలోని బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరవు ఛాయలు అలముకుంటున్నప్పటికీ, గోదావరి నీటిని సముద్రం పాలు చేస్తూ రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నారని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ మార్క్‌ను చెరిపేసేందుకే.. ఎన్డీఎస్ఏ నివేదిక వంకతో డ్రామాలు!
గోదావరిలో తగినంత నీటి ప్రవాహం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సరిహద్దు అవతలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని విజయవంతంగా లిఫ్ట్ చేసుకుంటున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. “మరమ్మతులు పూర్తయినప్పటికీ, కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఎన్డీఎస్ఏ (NDSA) నివేదికను సాకుగా చూపిస్తున్నారు. కేసీఆర్ కట్టించిన ఈ అద్భుత ప్రాజెక్టుకు చెడ్డపేరు తేవడమే కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అజెండా” అని కేటీఆర్ విమర్శించారు.
‘కన్నెపల్లి’ నుంచి నీళ్లు ఎత్తిపోయకుంటే ఉద్యమం తప్పదు!
ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెంటనే నీటిని లిఫ్ట్ చేసి బీడువారిన భూములకు మళ్లించాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







