దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!

- July 15, 2026 , by Maagulf
దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!

దోహా: ఖతార్ దివంగత ఫాదర్ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీ మృతి పట్ల అమీర్ హెచ్.హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని పలువురు పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

దోహాలోని లుసైల్ ప్యాలెస్‌లో అమీర్ ను పలు దేశాలకు చెందిన ప్రముఖులు కలుసుకున్నారు.  ఈ సందర్భంగా పలువురు షేక్‌లు, మంత్రులు, ప్రముఖులు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, పౌరులు ప్యాలెస్‌కు చేరుకుని దివంగత నేతకు ఘన నివాళులర్పించారు. 

అరబ్ దేశాలతో పాటు పలు మిత్రదేశాల ప్రతినిధులు కూడా విచ్చేసి అమీర్‌ను పరామర్శించారు. పలు దేశాధినేతలు టెలిఫోన్ ద్వారా అమీర్ ను పరామర్శించారు. దివంగత ఫాదర్ అమీర్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com