బహ్రెయిన్‌పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- July 15, 2026
మనామా: బహ్రెయిన్ లో ఇరాన్ దాడుల సమయంలో హింసాత్మక ఘటనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన ఇద్దరు మహిళలు సహా 10 మంది నిందితులకు హై క్రిమినల్ కోర్టు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు ఉగ్రవాద నేరాల విచారణ విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది. రెండు వేర్వేరు కేసుల్లో కోర్టు ఈ కీలక తీర్పులను వెలువరించింది.
గత మార్చి నెలలో బహ్రెయిన్‌పై ఇరాన్ దాడులు జరిగిన సమయంలో, సదరు నిందితులు ఘటనా స్థలాల్లో హింస మరియు విధ్వంసానికి పాల్పడుతుండగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన భద్రతా సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భద్రతా విభాగం ఇచ్చిన నివేదికల ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తక్షణమే దర్యాప్తు చేపట్టింది.
సాక్షుల స్టేట్మెంట్లు, ఫోరెన్సిక్ మరియు సాంకేతిక నివేదికల ఆధారంగా నేరం రుజువు కావడంతో నిందితులను హై క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేశారు.
కోర్టు పలు దఫాలుగా విచారణ జరిపి, నిందితులకు జైలు శిక్షలతో పాటు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న సొత్తును జప్తు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సమాజ భద్రతకు ముప్పు కలిగిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా విధ్వంసాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్‌పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







