అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- July 15, 2026
కువైట్ సిటీ: జ్లీబ్ అల్-షుయూఖ్ (అబ్బాసియా) ప్రాంతంలోని ఒక జ్యువెలరీ దుకాణంలో జరిగిన సంచలన చోరీ కేసును ఫర్వానియా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) అధికారులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు సిరియన్ జాతీయులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ద నుండి చోరీకి గురైన 39,000 కువైట్ దినార్ల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పిస్టల్, కత్తితో జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దుండగులు, అక్కడ ఉన్న సిబ్బందిని బెదిరించి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. నిందితుల్లో ఒకరిపై ఇదివరకే రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అరెస్ట్ వారెంట్లు ఉన్నట్లు తేలింది. అలాగే, ఈ దోపిడీ కోసం నిందితులు ఒక వాహనాన్ని దొంగిలించారని, ఆ వాహనాన్ని జ్లీబ్ అల్-షుయూఖ్ ప్రాంతంలో తగులబెట్టారని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్‌లో కొత్త అప్డేట్..
- కువైట్‌లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!







