ట్విట్టర్ లో మరో మైలురాయి చేరుకున్న మోడీ
- August 13, 2016
ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ట్విట్టర్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. భారతీయ రాజకీయరంగంలో ఏ నాయకుడికి లేని ఫాలోయింగ్ ఆయనకుందని చెప్పుకోవచ్చు. సోషల్ నెట్‌వర్కింగ్ రాజకీయం కూడా మోడీ ద్వారానే అమల్లోకి వచ్చిందనే వాళ్లూ ఉన్నారు. తాజాగా ట్విట్టర్‌లో మరో కొత్త సంచలనాన్ని మోదీ సృష్టించారు. ట్విట్టర్‌లో మోస్ట్ ఫాలోయింగ్ ఇండియన్‌గా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రికార్డును ఆయన దాటేశారు. బిగ్ బీ కంటే 16 వేల మంది ఫాలోయిర్స్ అధికంగా ఉండటం ద్వారా మోదీ నెంబర్ వన్ ప్లేస్‌లోకి వచ్చిచేరారు. గత జనవరిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ట్విట్టర్ ఫాలోయింగ్‌ను మోదీ అధిగమించి రెండో స్థానంలోకి వచ్చారు. ఈవారం ఆయన ఫాలోయిర్స్ సంఖ్య 2 కోట్ల 18 లక్షల 65 వేల 371 ఉంది. బచ్చన్ స్కోర్ 2 కోట్ల 18 లక్షల 48 వేల 572గా ఉంది. 2 కోట్లకు పైగా ఫాలోయిర్స్‌తో షారూక్ మూడో ప్లేస్‌లోకి వచ్చారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







