ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- July 17, 2026
అమెరికా: అంతర్జాతీయ విద్యార్థులు (F వీసా), ఎక్స్ఛేంజ్ విజిటర్స్ (J వీసా)కు అమెరికా ప్రభుత్వం ఇకపై గరిష్ఠంగా నాలుగేళ్ల కాలపరిమితిని మాత్రమే విధించనుంది. గతంలో “డ్యురేషన్ ఆఫ్ స్టే” (Duration of Status) విధానం అమల్లో ఉండేది. అంటే, ఒక విద్యార్థి కోర్సు పూర్తి కావడానికి ఐదేళ్లు లేదా ఆరేళ్లు పట్టినా, వారు చదువుకుంటున్నంత కాలం అమెరికాలోనే ఉండేందుకు అనుమతి లభించేది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం, కోర్సుతో సంబంధం లేకుండా గరిష్ఠంగా 4 ఏళ్లు మాత్రమే వీసా చెల్లుబాటు అవుతుంది. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా విద్యార్థులు అమెరికాలో కొనసాగాలనుకుంటే, యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కు ప్రత్యేకంగా పొడిగింపు (Extension) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో భాగంగా విద్యార్థులు మళ్లీ బయోమెట్రిక్స్ ఇవ్వడంతో పాటు, నిర్ణీత రుసుమును కూడా చెల్లించాల్సి ఉంటుంది.
భారతీయ విద్యార్థుల పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది?
ఈ కొత్త నిర్ణయం ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా పీహెచ్డీ (PhD) వంటి సుదీర్ఘ కాలం పట్టే పరిశోధన కోర్సులు చేసే వారికి, అలాగే కొన్ని ప్రత్యేక ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి నాలుగు సంవత్సరాల కాలం సరిపోదు. అలాంటి వారు ఇకపై కోర్సు మధ్యలోనే వీసా పొడిగింపు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల USCIS ఈ పొడిగింపు దరఖాస్తును తిరస్కరిస్తే, చదువు మధ్యలోనే ఆపేసి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అదనపు ఫీజుల భారం, బయోమెట్రిక్స్ నిబంధనలు విద్యార్థులలో మానసిక ఆందోళనను, ఆర్థిక భారాన్ని పెంచుతాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేయడం ద్వారా దేశంలోకి వచ్చే విదేశీయుల సంఖ్యను నియంత్రించాలనే వ్యూహంలో భాగమే ఈ నిర్ణయమని తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







