'కొరియన్ కనకరాజు' లో స్పెషల్ సాంగ్ చేసిన హీరోయిన్ దక్షా నాగర్కర్‌

- July 17, 2026 , by Maagulf
\'కొరియన్ కనకరాజు\' లో స్పెషల్ సాంగ్ చేసిన హీరోయిన్ దక్షా నాగర్కర్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్ , ఫస్ట్ సింగిల్ 'కంసంనిద', టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. 'రాసగుమ్మడి' ఫుల్ లిరికల్ సాంగ్‌ను జూలై 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వరుణ్ తేజ్, హీరోయిన్ దక్షా నాగర్కర్ కలర్ ఫుల్ లుక్‌తో విడుదలైన సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ మాస్-ఫెస్టివ్ సాంగ్‌ వైబ్ ని క్రియేట్ చేస్తోంది.

కొరియన్ కనకరాజు లో దక్షా నాగర్కర్‌ స్పెషల్ సాంగ్ చేస్తోంది. వరుణ్ తేజ్, దక్షా నాగర్కర్‌పై చిత్రీకరించిన రాసగుమ్మడి సాంగ్ కలర్‌ఫుల్ రాయలసీమ జాతర నేపథ్యంలో తెరకెక్కిన మాస్ డ్యాన్స్ నంబర్‌గా ఉండబోతోంది.

పోస్టర్‌లో ఇద్దరి ఎనర్జిటిక్ లుక్స్, ఫెస్టివ్ వైబ్స్ పాటపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. థమన్ సంగీతం అందించిన ఈ పాట మరో చార్ట్‌బస్టర్‌గా కానుంది.

ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి కటసాని డీవోపీగా పని చేస్తున్నారు.

సరికొత్త కాన్సెప్ట్, ఆకట్టుకునే విజువల్స్, కమర్షియల్ ట్రీట్‌తో ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం:  మేర్లపాక గాంధీ
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి
బ్యానర్లు: యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రాఫర్: మనోజ్ రెడ్డి
ఎడిటర్: సత్య జి
ఆర్ట్: ఎ పన్నీర్‌సెల్వం
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com