ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- July 17, 2026
ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో వింత వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు.. సరియైన వర్షాలు పడకపోవటంతో రైతులు సాగు పనుల్లో ముందుకు వెళ్లలేక ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలోని ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిలకు జారీ చేసింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్–జార్ఖండ్–ఉత్తర ఒడిశా ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతుండటంతో దాని ప్రభావం రాష్ట్రంపై కనిపించనుందని అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశముండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
శనివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రత్యేకంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలవొద్దని హెచ్చరించారు. అలాగే తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు రావొద్దని, అత్యసరమై బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ సూచించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







