విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- July 19, 2026
విజయవాడ: విజయవాడ విమానాశ్రయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్రాంతీయ విమాన రవాణా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమావేశంలో సమీక్షించారు. విమానాశ్రయంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణలో చేపడుతున్న మెరుగుదలలు, భవిష్యత్తులో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలపై అధికారులు వివరాలను అందించారు.
విమానాశ్రయ సామర్థ్యాన్ని పెంచి, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







