ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- July 24, 2026
ఫుజైరా: యూఏఈలోని ఫుజైరా–ఖోర్‌ఫక్కాన్ రోడ్డుపై జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో 28 ఏళ్ల మహిళ, ఆమె ఏడాది వయస్సు గల కుమార్తె మృతి చెందారు. భర్తతో పాటు మూడు సంవత్సరాల మరో కుమార్తె ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ ఫుజైరాలోని షేక్ ఖలీఫా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
అధికారుల వివరాల ప్రకారం.. ఎమిరాటి కుటుంబం ఫుజైరా–ఖోర్‌ఫక్కాన్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా, ఫౌజ్ పెట్రోలియం ప్రాంతంలో రోడ్డుపక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వారి కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే ఫుజైరా పోలీసుల అత్యవసర బృందాలు, నేషనల్ అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లి, ఏడాది చిన్నారి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. తండ్రి, పెద్ద కుమార్తెకు చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలకు గురువారం ఖోర్ఫక్కాన్లో ఇషా నమాజ్ అనంతరం అంత్యక్రియలు నిర్వహించగా, కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు నివాళులర్పించారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ దృష్టి మరలడం (డిస్ట్రాక్షన్) కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు పరిశీలిస్తున్నారు.
డ్రైవర్లకు ఫుజైరా పోలీసుల హెచ్చరిక
ఈ ఘటన నేపథ్యంలో ఫుజైరా పోలీసులు వాహనదారులకు మరోసారి అప్రమత్తత సూచించారు. ఫుజైరా పోలీసు ట్రాఫిక్ అండ్ పట్రోల్స్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ సాలెహ్ మహమ్మద్ అబ్దుల్లా అల్ ధన్హానీ మాట్లాడుతూ.. డ్రైవింగ్ సమయంలో క్షణిక నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాల వద్దకు చేరుకునే సమయంలో వేగాన్ని తగ్గించాలని, సురక్షిత దూరాన్ని పాటించాలని, ఓవర్టేక్ చేసే ముందు పక్క లేన్లు ఖాళీగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు.
అలాగే ఆకస్మికంగా లేన్ మార్చడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం లేదా డ్రైవింగ్‌పై దృష్టి మరల్చే ఏ చర్యనైనా నివారించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రహదారి పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని నియంత్రించాలని వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్లూ క్యాంపెయిన్ విస్తరణ..!!
- 974 బీచ్‌లో ‘ఫ్లోటీస్ ఫెస్టివల్’.. సందడి చేసేలా ఏర్పాట్లు..!!
- కువైట్‌లో ప్రవాసులకు లోన్లు మరింత కఠినం..!!
- సౌదీ–ఖతార్‌లో కొత్త చెల్లింపు సదుపాయం..!!
- ఆర్థిక, ఆర్థిక సహకారం బలోపేతంపై బహ్రెయిన్–సెర్బియా చర్చలు..!!
- టెస్లా కార్లు రీకాల్.. ఎయిర్‌బ్యాగ్‌లో సాంకేతిక లోపం..!!
- సుల్తాన్ బోట్స్వానా పర్యటనతో కొత్త పెట్టుబడి అవకాశాలు..!!
- షార్జాలో విషాదం.. ఇంట్లో కుప్పకూలి 32 ఏళ్ల భారతీయ మహిళ మృతి..!!
- పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు..పోలీసు అధికారులతో డీజీపీ కీలక చర్చలు
- అబుదాబిలో యూఏఈ–ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరం ప్రారంభం







