ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!

- July 24, 2026 , by Maagulf
ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!

మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ మిడిలీస్టులో నెలకొన్న తాజా పరిణామాలు, వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితులపై టెలిఫోన్ ద్వారా చర్చించారు.

అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాంతీయ ఉద్రిక్తతలను అదుపులోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను ఇరు దేశాల నాయకులు సమీక్షించారు.

అంతర్జాతీయ చట్టాల నిబంధనలకు అనుగుణంగా సముద్ర మార్గాల్లో నౌకాయాన భద్రతను పరిరక్షిస్తూ, ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడే చర్యలను కొనసాగించాల్సిన అవసరాన్ని వారు తెలియజేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగించాలని ఇరు దేశాధినేతలు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com