ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- July 25, 2026
దోహా: ప్రపంచంలోనే అతిపెద్ద మార్షల్ ఆర్ట్స్ సంస్థ ONE ఛాంపియన్షిప్ మరియు విజిట్ ఖతార్ తమ భాగస్వామ్యాన్ని మరో మూడు సంవత్సరాలకు పొడిగించాయి. ఈ ఒప్పందం ప్రకారం 2027 నుంచి ఖతార్‌లో వరుసగా అంతర్జాతీయ స్థాయి ONE ఛాంపియన్షిప్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో నిర్వహించే పోటీల్లో MMA, మువాయ్ థాయ్, కిక్‌బాక్సింగ్, సబ్మిషన్ గ్రాప్లింగ్ విభాగాల్లో ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్టార్ క్రీడాకారులతో పాటు మధ్యప్రాచ్యానికి చెందిన ప్రతిభావంతులైన ఫైటర్లకు కూడా అవకాశం కల్పించనున్నారు.
ఈ ఈవెంట్ల ద్వారా విదేశీ పర్యాటకుల రాక పెరగడంతో పాటు ఖతార్‌కు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కింద తొలి ఈవెంట్ 2027 మార్చి 26న దోహాలోని అస్పైర్ డోమ్ లో జరగనుంది. టికెట్ల విక్రయం, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ONE ఛాంపియన్షిప్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ అధ్యక్షుడు హువా ఫంగ్ టెహ్ మాట్లాడుతూ.. ఖతార్‌తో భాగస్వామ్యాన్ని కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం







