ఆగస్ట్ 1న ‘రక్త చరిత్ర 2’ రీ రిలీజ్
- July 25, 2026
హీరో సూర్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్ . మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ధ శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులకు చెందిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబం ధించిన యథార్థ ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ గతంలో ‘రక్త చరిత్ర’ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎలాంటి ఒత్తిడులు, భయాలకు లొంగకుండా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ రెండు చిత్రాలు సంచలనం సృష్టించాయి. నటీ నటులు తమ, తమ పాత్రలలో ఒదిగిపోయిన విధానం, రామ్ గోపాల్ వర్మ టేకింగ్, అప్పట్లో ఆయన ఉపయోగించిన లేటెస్ట్ టెక్నాలజీ ఈ చిత్రాలకు ఆయువు పట్టుగా నిలిచాయి. ఈ రెండు పార్ట్ చిత్రాలు ఒకే ఏడాది అనగా 2010లో వరుసగా విడుదలైన విషయం గుర్తుండే ఉంటుంది.
దాదాపు 16 ఏళ్ల తర్వాత రక్త చరిత్ర పార్ట్ 1 చిత్రాన్ని ఇటీవలే రీ రిలీజ్ చేయగా…హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మంచి స్పందన రావడంతో ఇప్పుడు రక్త చరిత్ర పార్ట్ 2 చిత్రాన్ని ఆగస్ట్ 1న థియేటర్స్ లో రీ రిలీజ్ చేయబోతున్నారు. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రంలో రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్తచరిత్ర అంటూ సాగే నేపథ్య గీతంతో పాటు కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం అనే మరో పాటతో కలుపుకుని కథానుసారం సందర్భానుసారమైన రెండు పాటలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయమని చాలా రోజులుగా ప్రేక్షకులు కోరుతుండటంతో పాటు నేటితరం యూత్ కు కూడా వాస్తవిక కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో రామ్ గోపాల్ వర్మ రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం
- వాణిజ్యం నుంచి లాజిస్టిక్స్ కారిడార్ల వరకు..విస్తరిస్తున్న భారత్-యూఏఈ ఆర్థిక భాగస్వామ్యం
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!







