భద్రతా సహకారంపై బహ్రెయిన్, సౌదీ అరేబియా చర్చలు..!!

- July 25, 2026 , by Maagulf
భద్రతా సహకారంపై బహ్రెయిన్, సౌదీ అరేబియా చర్చలు..!!

మనామా: భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసే విషయమై బహ్రెయిన్, సౌదీ అరేబియా చర్చలు జరిపాయి. సౌదీ–బహ్రెయిన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ పరిధిలోని సెక్యూరిటీ కమిటీ వర్కింగ్ గ్రూప్ ఏడో సమావేశం బహ్రెయిన్‌లో జరిగింది. ఈ సమావేశానికి బహ్రెయిన్ తరఫున డిప్యూటీ చీఫ్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ మేజర్ జనరల్ డాక్టర్ షేక్ హమద్ బిన్ మహ్మద్ అల్ ఖలీఫా అధ్యక్షత వహించారు.  సౌదీ ప్రతినిధి బృందానికి సౌదీ హోం మంత్రిత్వ శాఖలోని లీగల్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ బిన్ సులేమాన్ అల్ ఈస్సా నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా మేజర్ జనరల్ డాక్టర్ షేక్ హమద్ మాట్లాడుతూ.. రెండు సోదర దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలకు అనుగుణంగా భద్రతా సహకారం మరింత బలోపేతం చేయడం అత్యంత కీలకమని అన్నారు. పరస్పర సహకారం ద్వారా భద్రతా రంగంలో ఉమ్మడి కార్యక్రమాలు వేగవంతమవడంతో పాటు ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ, ప్రాంతీయ భద్రత మరింత బలపడతాయని పేర్కొన్నారు.

సమావేశంలో సెక్యూరిటీ కమిటీ చేపట్టిన కార్యక్రమాల పురోగతి, ఇప్పటివరకు సాధించిన విజయాలను సమీక్షించారు. అలాగే ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని మరింత విస్తరించడం, కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com