సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- July 26, 2026
రియాద్: సౌదీ అరేబియాలో అక్రమ నివాసం, కార్మిక, సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించిన వారిపై అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. జూలై 16 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 14,970 మందిని అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టయిన వారిలో 7,437 మంది నివాస చట్టం, 3,991 మంది సరిహద్దు భద్రతా చట్టం, 3,542 మంది కార్మిక చట్టం ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా, అక్రమంగా సౌదీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 1,626 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 62 శాతం ఇథియోపియా, 37 శాతం యెమెన్, మిగిలిన 1 శాతం ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. అలాగే అక్రమంగా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన 33 మందిని కూడా అరెస్ట్ చేశారు. నివాస, కార్మిక, సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆశ్రయం కల్పించడం, రవాణా చేయడం లేదా ఉద్యోగాలు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడిన 18 మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం 30,546 మంది న్యాయపరమైన ప్రక్రియలో ఉన్నారని, వారిలో 13,251 మందిని ఇప్పటికే స్వదేశాలకు పంపించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు, అక్రమ వలసదారులకు సహాయం చేసే వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానా, అలాగే నేరానికి ఉపయోగించిన వాహనాలు, ఆస్తుల స్వాధీనం వంటి కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. ప్రజలు చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం ఉంటే మక్కా, మదీనా, రియాద్, ఈస్టర్న్ ప్రావిన్స్‌లో 911, ఇతర ప్రాంతాల్లో 999కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







