సెర్బియా పర్యటన ముగించుకుని యూఏఈ అధ్యక్షుడు స్వదేశానికి తిరుగు ప్రయాణం
- July 31, 2026
బెల్‌గ్రేడ్: యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సెర్బియా గణరాజ్యంలో తన అధికారిక కార్యాచరణ పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు.
పర్యటన ముగిసిన అనంతరం బెల్‌గ్రేడ్‌లోని నికోలా టెస్లా అంతర్జాతీయ విమానాశ్రయంలో సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్ స్వయంగా హాజరై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సెర్బియా ప్రభుత్వం తరఫున పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం, వాణిజ్యం, సాంకేతికతతో పాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
యూఏఈ–సెర్బియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా ఈ పర్యటన కీలకంగా నిలిచిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..
- రేపే ఏపీకి ప్రధాని మోదీ..
- సెర్బియా పర్యటన ముగించుకుని యూఏఈ అధ్యక్షుడు స్వదేశానికి తిరుగు ప్రయాణం
- మారనున్న విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు!
- ఏపీకి రిలయన్స్ సరికొత్త సంచలనం..
- ఆగస్టు నెలకు యూఏఈలో కొత్త ఇంధన ధరలు ప్రకటింపు..







