సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!

- August 01, 2026 , by Maagulf
సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!

రియాద్:సౌదీ అరేబియాలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నాన్ని జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) అధికారులు భగ్నం చేశారు. అల్ హదీథా సరిహద్దు చెక్‌పోస్ట్ ద్వారా రాజ్యంలోకి ప్రవేశిస్తున్న ఓ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 36,773 యాంఫెటమైన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ZATCA అధికార ప్రతినిధి హమ్మూద్ అల్-హర్బీ వివరాలను వెల్లడించారు. భద్రతా స్కానింగ్ పరికరాలు, ప్రత్యేక తనిఖీల ద్వారా బస్సును పరిశీలించగా, వాహనం కింది భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరలో ఈ పిల్స్ ను దాచినట్లు గుర్తించారు.

సరిహద్దు ప్రాంతాల్లో స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కస్టమ్స్ తనిఖీలను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని, ఈ విషయంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ తో సమన్వయంగా పనిచేస్తున్నామని అల్-హర్బీ తెలిపారు.
అక్రమ రవాణాపై సమాచారం ఉన్నవారు 1910 హెల్ప్‌లైన్, [[email protected]](mailto:[email protected]) ఈమెయిల్ లేదా +966 11 910 అంతర్జాతీయ నంబర్ ద్వారా సమాచారం అందించాలని జాట్‌కా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు, కేసు నిర్ధారణకు దారితీసే సమాచారం అందించిన వారికి నగదు బహుమతి కూడా అందజేస్తామని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com