కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- August 01, 2026
కువైట్ : కువైట్‌లో 2026 తొలి ఆరు నెలల్లో పౌరులు, ప్రవాసుల వినియోగ వ్యయం గతేడాదితో పోలిస్తే 5 శాతం పెరిగి KD 27.922 బిలియన్లకు చేరినట్లు కువైట్ సెంట్రల్ బ్యాంక్ (CBK) వెల్లడించింది. ఈ కాలంలో మొత్తం 809.57 మిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2025 ఇదే కాలంలో నమోదైన KD 26.592 బిలియన్లతో పోలిస్తే ఈ ఏడాది KD 1.309 బిలియన్ల మేర ఖర్చులు పెరిగినట్లు సీబీకే వెల్లడించింది.
గణాంకాల ప్రకారం, 2026 తొలి త్రైమాసికంలో 392.3 మిలియన్ల లావాదేవీల ద్వారా KD 14.034 బిలియన్లు, రెండో త్రైమాసికంలో 417.258 మిలియన్ల లావాదేవీల ద్వారా KD 13.888 బిలియన్లు ఖర్చు చేశారు. ఆరు నెలల కాలంలో పాయింట్ ఆఫ్ సేల్ (POS) లావాదేవీలే అత్యధికంగా నమోదయ్యాయి. వీటి ద్వారా 505.04 మిలియన్ల లావాదేవీలతో KD 9.462 బిలియన్ల చెల్లింపులు జరిగాయి.
అలాగే, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణలు 31.98 మిలియన్ల లావాదేవీలతో KD 4.369 బిలియన్లకు చేరగా, వెబ్సైట్ల ద్వారా జరిగిన ఆన్లైన్ కొనుగోళ్లు 186.98 మిలియన్ల లావాదేవీలతో KD 8.533 బిలియన్లు నమోదయ్యాయి. ఇక సెంట్రల్ బ్యాంక్ తక్షణ డిజిటల్ చెల్లింపు సేవ ‘వమ్ద్ (Wamd)’ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. 2025 తొలి అర్ధభాగంతో పోలిస్తే 52.3 శాతం వృద్ధి నమోదు చేస్తూ, 2026 తొలి ఆరు నెలల్లో 85.56 మిలియన్ల లావాదేవీల ద్వారా KD 5.557 బిలియన్ల చెల్లింపులు జరిగాయి.
మొదటి త్రైమాసికంలో వమ్ద్ ద్వారా 40.38 మిలియన్ల లావాదేవీలతో KD 2.646 బిలియన్లు, రెండో త్రైమాసికంలో 45.177 మిలియన్ల లావాదేవీలతో KD 2.91 బిలియన్లు నమోదయ్యాయి. దీంతో కువైట్‌లో తక్షణ డిజిటల్ చెల్లింపు సేవల వినియోగం వేగంగా పెరుగుతోందని సీబీకే పేర్కొంది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







