రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- August 01, 2026
న్యూఢిల్లీ/మచిలీపట్నం: రసాయన ఎరువుల తయారీలో కీలకమైన ముడి పదార్థాలైన అమ్మోనియా, సల్ఫర్ దిగుమతుల పై ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు వెల్లడైంది.మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ లోక్‌సభలో సమగ్ర సమాధానం ఇచ్చింది.
కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశానికి అమ్మోనియా ప్రధాన ఎగుమతిదారుగా రష్యా లేదని స్పష్టం చేసింది. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకున్న 21.4 లక్షల మెట్రిక్ టన్నుల సల్ఫర్‌లో కేవలం 1.47 లక్షల మెట్రిక్ టన్నులు (6.8 శాతం) మాత్రమే రష్యా నుంచి వచ్చినట్లు పేర్కొంది.
రష్యాలోని టోలియట్టి నుంచి ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు వరకు ఉన్న అమ్మోనియా పైప్‌లైన్ దెబ్బతిన్నప్పటికీ, అది కేవలం ద్రవ అమ్మోనియా రవాణాకు మాత్రమే ఉపయోగపడే పైప్‌లైన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా లేదా భారతదేశంలో సల్ఫర్ సరఫరాపై ప్రత్యక్ష ప్రభావం చూపలేదని కేంద్రం వివరించింది.
సల్ఫర్ ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ రవాణా వ్యయాల పెరుగుదల, సముద్ర బీమా ప్రీమియంలు అధికమవడం, సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాలేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలో ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల కొరత లేకుండా ఉండేందుకు పలు చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. పోషకాధారిత సబ్సిడీ (NBS) పథకం కింద ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులను ఓపెన్ జనరల్ లైసెన్స్ (OGL) విధానంలో దిగుమతి చేసుకునే వెసులుబాటును ఎరువుల తయారీ సంస్థలకు కల్పించినట్లు పేర్కొంది.
అదేవిధంగా, ఎరువుల పరిశ్రమకు సల్ఫర్ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని IOCL, BPCL, HPCL, MRPL, CPCL, NRL వంటి ప్రభుత్వ రంగ రిఫైనరీలకు సూచించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖను ఎరువుల శాఖ కోరినట్లు వెల్లడించింది.
దిగుమతి అమ్మోనియాపై ఆధారాన్ని తగ్గించేందుకు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ పథకం కింద సంవత్సరానికి సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఎరువుల తయారీ సంస్థలకు అందించే లక్ష్యంతో 2026 మార్చి 30న SECI మరియు ఎరువుల సంస్థల మధ్య పదేళ్ల ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించింది. మరో మూడు సంవత్సరాల్లో గ్రీన్ అమ్మోనియా సరఫరా ప్రారంభం కానుండగా, గ్రీన్ అమ్మోనియా, గ్రే అమ్మోనియా మధ్య వ్యయ భేదాన్ని కేంద్ర ఎరువుల శాఖ భరించనుంది.
ఈ చర్యల ద్వారా దేశంలో ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల లభ్యతను మెరుగుపరచడంతో పాటు దిగుమతులపై ఆధారాన్ని క్రమంగా తగ్గించి, రైతులకు ఎరువుల సరఫరా నిరంతరంగా అందేలా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







