కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- August 01, 2026
బెంగళూరు: ఇటీవల సోషల్ మీడియాలో కర్ణాటకలో 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందంటూ ఒక వార్త విస్తృతంగా వైరల్ అయింది.ఈ వార్తతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ ప్రచారాన్ని కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ (KSAPS) పూర్తిగా ఖండించింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
ఆరోగ్య శాఖ అలాంటి ఆదేశాలు జారీ:
సొసైటీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, వైరల్ అవుతున్న 7 వేల మంది విద్యార్థుల గణాంకం పూర్తిగా తప్పుదోవ పట్టించేదని తెలిపారు. అలాగే కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేశారనే ప్రచారంలో కూడా ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం లేదా సంబంధిత ఆరోగ్య శాఖ అలాంటి ఆదేశాలు జారీ చేయలేదని వెల్లడించారు.
అధికారులు వివరించిన ప్రకారం, 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల హెచ్ఐవీ బాధితుల్లో సుమారు 39 వేల మందికి 2004 సంవత్సరం నుంచి యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ గణాంకాలు రాష్ట్రంలోని మొత్తం హెచ్ఐవీ బాధితులకు సంబంధించినవేనని, వాటిని కేవలం కాలేజీ విద్యార్థులతో ముడిపెట్టి ప్రచారం చేయడం పూర్తిగా తప్పుదారి పట్టించే చర్య అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, సోషల్ మీడియాలో నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని అధికారిక ప్రభుత్వ వర్గాలు లేదా ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనల ద్వారానే తెలుసుకోవాలని సూచించారు. తప్పుడు ప్రచారం సమాజంలో అనవసర భయాందోళనలు సృష్టించడంతో పాటు హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తులపై వివక్షకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. కాబట్టి ఇలాంటి సున్నితమైన అంశాలపై వాస్తవాలను మాత్రమే విశ్వసిస్తూ, నిర్ధారిత సమాచారం ఆధారంగానే స్పందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







