యూఏఈలో సమ్మర్ స్టేకేషన్లకు భారీ ఆఫర్లు..!!
- August 02, 2026
దుబాయ్: వేసవి సెలవులను కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలనుకునే వారికి యూఏఈ హోటళ్లు ఆకర్షణీయమైన స్టేకేషన్ ప్యాకేజీలను ప్రకటించాయి. Dh169 నుంచే గదులు అందుబాటులో ఉండగా, కొన్ని హోటళ్లు 24 గంటల పూర్తి స్టే, పిల్లలకు ఉచిత బస, ఉచిత భోజనం, రెండో రాత్రి ఉచిత వసతి వంటి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి.
హోటల్ రంగ నిపుణుల ప్రకారం.. యూఏఈ నివాసితులు ఇప్పుడు కేవలం హోటల్ గదికే కాకుండా కుటుంబ సభ్యులందరికీ వినోదం, విశ్రాంతి, ప్రత్యేక అనుభవాలను అందించే "ఎక్స్పీరియన్స్ ఆధారిత స్టేకేషన్ల" వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పాఠశాలల సెలవుల సమయంలో కుటుంబాలతో కలిసి స్టేకేషన్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు.
వాల్యూర్ హాస్పిటాలిటీ పార్ట్నర్స్ నిర్వహిస్తున్న దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ మరియు దీరా క్లస్టర్ ఆఫ్ హోటల్స్ లో 'గోల్డెన్ సమ్మర్ ఎస్కేప్' పేరుతో గది అద్దె Dh169 నుంచే ప్రారంభమవుతోంది. 12 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉంటే వారికి బస, భోజనం ఉచితంగా అందించనున్నారు.
24 గంటల స్టే సౌకర్యం
జా హట్టా ఫోర్ట్ హోటల్ లో సెప్టెంబర్ 30 వరకు ఆదివారం నుంచి గురువారం మధ్య చెక్-ఇన్ చేసే అతిథులకు ప్రత్యేకంగా 24 గంటల స్టే అవకాశం కల్పిస్తోంది. ఉదయం 9 గంటలకు లేదా రాత్రి 9 గంటలకు చెక్-ఇన్ చేసినా, అదే సమయానికి మరుసటి రోజు చెక్-అవుట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
Dh199 నుంచే ఫ్యామిలీ ప్యాకేజీలు
జన్నా హోటల్స్ అండ్ రిసార్ట్స్ దుబాయ్, రాస్ అల్ ఖైమాలో Dh199 నుంచే సమ్మర్ వీక్డే ఎస్కేప్ ప్యాకేజీలను అందిస్తోంది. ఇందులో హాఫ్బోర్డ్ భోజనం, స్పా సేవలపై రాయితీలు, ఫ్లెక్సిబుల్ చెక్-ఇన్, చెక్-అవుట్ సదుపాయాలు ఉన్నాయి. రాస్ అల్ ఖైమాలోని మూడు బెడ్రూమ్ల విల్లాలో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్తో పాటు ఆహార, పానీయాలపై 25 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ప్రత్యేక అనుభవాలకు ప్రాధాన్యం
హబ్టూర్ పోలో రిసార్ట్ లో గుర్రపు స్వారీ కేంద్రాల సందర్శన, ప్రత్యేక అనుభవాలతో కూడిన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గదుల ఉచిత అప్‌గ్రేడ్, ముందస్తు చెక్-ఇన్, ఆలస్యంగా చెక్-అవుట్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు.
హోటల్ ప్రతినిధుల ప్రకారం.. భోజనంతో కూడిన ప్యాకేజీలు, స్పా, వాటర్ స్పోర్ట్స్, గోల్ఫ్, కుటుంబ వినోద కార్యక్రమాలు వంటి అదనపు సౌకర్యాలు కలిగిన స్టేకేషన్లకే ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉంది. యూఏఈ పర్యాటక రంగ అభివృద్ధి, ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా ఈ ఏడాది మిగిలిన కాలంలో కూడా హోటళ్ల ఆక్యుపెన్సీ ఆశాజనకంగా ఉంటుందని హోటల్ రంగ నిపుణులు విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక
- బాల్టిమోర్‌లో ఎన్ఆర్ఐ కమిటీతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి
- దుబాయ్ పోలీస్ కొత్త డిజిటల్ సేవ..
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- 'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!
- కువైట్‌లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!
- ఒమాన్‌కు చేరిన నధీరా అల్ హార్థీ భౌతికకాయం..!!
- ఖతార్‌లో వ్యాపార ప్రారంభానికి ప్రత్యేక సహాయ కేంద్రం..!!
- యూఏఈలో సమ్మర్ స్టేకేషన్లకు భారీ ఆఫర్లు..!!







