కువైట్‌లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్‌..KD150..!!

- August 02, 2026 , by Maagulf
కువైట్‌లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్‌..KD150..!!

కువైట్ : విజిట్ వీసాను సాధారణ రెసిడెన్సీ పర్మిట్‌గా మార్చుకునే విదేశీయులకు 150 కువైటీ దినార్ (KD150) ఫీజును కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) నిర్ణయించింది. ఈ మేరకు విదేశీయుల నివాస చట్టం అమలు నిబంధనల్లో సవరణలు చేసింది.

సవరించిన నిబంధనల ప్రకారం. ఆర్టికల్-39లోని తొమ్మిదో పేరాలో కొత్తగా క్లాజ్-4ను చేర్చారు. దీని ప్రకారం ఆర్టికల్-16 నిబంధనల కింద విజిట్ వీసాను సాధారణ రెసిడెన్సీ పర్మిట్‌గా మార్చుకునే సేవకు KD150 స్థిర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, డొమెస్టిక్ వర్కర్లు మరియు వారికి సమానమైన కేటగిరీలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఆర్టికల్-20 ప్రకారం వీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ నిర్ణయాన్ని తమ పరిధిలో వెంటనే అమలు చేయాలని సంబంధిత అధికారులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com