'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!

- August 02, 2026 , by Maagulf
\'ఈసా ది గ్రేట్\'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!

మనామా: బహ్రెయిన్ ఆధునిక రాష్ట్ర నిర్మాణానికి పునాది వేసిన పాలకుడు ఈసా బిన్ అలీ అల్ ఖలీఫా గౌరవార్థం 'ఇయర్ ఆఫ్ ఈసా ది గ్రేట్' సందర్భంగా బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది. మనామాలోని పోస్టల్ మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమంలో రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ఈ స్మారక స్టాంప్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ఈ తపాలా బిళ్ల దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. బహ్రెయిన్ తపాలా సేవల చరిత్ర 1884 ఆగస్టు 1న మనామాలో తొలి పోస్టాఫీస్ ప్రారంభంతో మొదలైందని, అప్పటి నుంచి తపాలా రంగం ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా అభివృద్ధి చెందుతూ దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

జాతీయ నాయకుల సేవలను స్మారక తపాలా బిళ్లల రూపంలో గుర్తించడం ద్వారా వారి చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించవచ్చని మంత్రి అన్నారు. ఇలాంటి స్టాంపులు దేశ చరిత్రను, ప్రముఖుల సేవలను శాశ్వతంగా నిలుపుతాయని ఆయన వివరించారు.

బహ్రెయిన్ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖుల సేవలను గుర్తిస్తూ ఇలాంటి స్మారక పోస్టల్ స్టాంప్ లను విడుదల చేయడం మంత్రిత్వ శాఖ లక్ష్యమని తెలిపారు. ఈసా బిన్ అలీ అల్ ఖలీఫా నాయకత్వం ఆధునిక బహ్రెయిన్ నిర్మాణానికి, ప్రభుత్వ వ్యవస్థల బలోపేతానికి కీలకంగా నిలిచిందని మంత్రి కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com