కూటమి సర్కార్ పై జగన్ ఫైర్
- August 02, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పరాకాష్ఠకు చేరిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా (X) ప్రభుత్వంపై విమర్శల బాణాలు సంధించారు. రాష్ట్రంలో నారాసుర పాలన సాగుతోందని దుయ్యబట్టారు. దాడి చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షణ కల్పిస్తూ, దాడులకు గురైన బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జగన్ తీవ్రంగా ఆరోపించారు.
‘ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గం’: వైఎస్సార్సీపీ అధినేత హెచ్చరిక
“ప్రభుత్వ వైఫల్యాలను, అన్యాయాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?” అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. పోలీసు వ్యవస్థను రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటూ ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అయితే, కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తమ పార్టీ వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై నిలదీస్తూ, ప్రభుత్వ అరాచకాలపై రాజీలేని పోరాటం చేస్తామని, వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ జైలు నుంచి విడుదలై..అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా సూత్రధారిగా మారిన కన్నూర్ వ్యక్తి అరెస్ట్
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- హోర్ముజ్ జలసంధిలో కొత్త సముద్ర మార్గంపై ఇరాన్–ఒమాన్ ఒప్పందం దిశగా కీలక పురోగతి
- 2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్ ప్రజా రవాణాలో 34.81 కోట్ల ప్రయాణాలు..
- సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ట్రంప్ కీలక చర్చలు.
- కూటమి సర్కార్ పై జగన్ ఫైర్
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్, జోర్డాన్ రాజులు..
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు







