ఖతార్‌లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్‌కు QR250 ఫీజు..!!
- August 04, 2026
దోహా: ఖతార్ ప్రభుత్వం అద్దె చట్టంలో కీలక మార్పులు చేసింది. 2008 నాటి చట్టం నం. 4లో సవరణలు చేస్తూ 2026 నాటి చట్టం నం.8ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గెజిట్‌లో కొత్త నిబంధనలను ప్రకటించింది.కొత్త చట్టం ప్రకారం, ప్రతి నివాస, వాణిజ్య లేదా ఇతర యూనిట్‌కు సంబంధించిన లీజ్ ఒప్పందాన్ని నమోదు చేసుకునేందుకు QR250 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అద్దెదారులు–ఇంటి యజమానుల మధ్య తలెత్తే అన్ని వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు రెంటల్ డిస్ప్యూట్స్ కమిటీకి ప్రత్యేక అధికారాలు కల్పించారు. ఈ కమిటీ పరిధిలోకి వచ్చే వివాదాలపై నేరుగా కోర్టును ఆశ్రయించేందుకు వీలు ఉండదు. ముందుగా కమిటీని సంప్రదించి, దాని నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రమే కోర్టులో అప్పీల్ చేయాలి. కమిటీ ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి ఉన్న పక్షాలు 15 రోజులలోపు కోర్ట్ ఆఫ్ అప్పీల్ ను ఆశ్రయించవచ్చు.
అలాగే, ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులను వినియోగిస్తున్న లబ్ధిదారులు తమ ఒప్పందాల్లో అనుమతి ఉన్నట్లయితే, మూడో వ్యక్తులకు ఇచ్చే లీజ్ ఒప్పందాలను రెండు నెలల్లోపు తప్పనిసరిగా నమోదు చేయాలి. అయితే వీరికి QR250 రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
కొత్త నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా QR10,000 వరకు జరిమానా విధించనున్నారు. అయితే తుది తీర్పు వెలువడకముందే నిర్ణీత మొత్తం, వర్తించే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి కేసును రాజీ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని సంబంధిత అన్ని శాఖలకు ఖతార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్‌లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్‌యూవీల రీకాల్..!!
- ఇరాన్‌తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్‌పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్‌లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్‌కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్‌లోని ఫిలిప్పీన్స్ బేకర్‌కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్‌పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







