మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్‌పై ప్రత్యేక ఆఫర్..!!

- August 04, 2026 , by Maagulf
మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్‌పై ప్రత్యేక ఆఫర్..!!

మస్కట్: ప్రయాణికులకు ఊరట కలిగించేలా ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక పార్కింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. పరిమిత కాలం పాటు P1, P2 పార్కింగ్ ప్రాంతాల్లో రోజుకు కేవలం OMR 3.200 చెల్లించి వాహనాలను పార్క్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఆగస్టు 30 వరకు అందుబాటులో ఉంటుందని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ తెలిపింది. దీంతో ప్రయాణికులు తమకు అనుకూలమైన పార్కింగ్ స్థలాన్ని ఎంచుకుని మరింత సౌకర్యవంతంగా ప్రయాణాన్ని ప్రారంభించవచ్చని పేర్కొంది.

తమ అధికారిక సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన ఒమన్ ఎయిర్‌పోర్ట్స్.. ప్రయాణికులు ఈ ప్రత్యేక ఆఫర్‌ను వినియోగించుకుని విమానాశ్రయంలోని ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. వేసవి సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. టెర్మినల్‌కు సమీపంలోనే నిర్ణీత రోజువారీ చార్జీతో పార్కింగ్ సౌకర్యం లభించడం వల్ల ప్రయాణం మరింత సులభంగా మారనుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com