అమీర్‌తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!

- August 05, 2026 , by Maagulf
అమీర్‌తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!

దోహా: ఖతార్ అమీర్ హిజ్ హైనెస్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, తాజా ప్రాంతీయ పరిణామాలపై వారు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, దౌత్యపరమైన చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం సాధించే అవకాశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ప్రాంతీయ శాంతి, భద్రత కోసం ఖతార్ పోషిస్తున్న కీలక పాత్రను ట్రంప్ ప్రశంసించారు. అమీర్ నాయకత్వంలో ఖతార్ దౌత్య ప్రయత్నాలకు, వివాదాల పరిష్కారానికి వేదిక కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.

వివాదాస్పద అంశాలను పరిష్కరించడంలో దౌత్య మార్గాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అమీర్ షేక్ తమీమ్ అన్నారు. అమెరికా–ఇరాన్ అవగాహన ఒప్పందంలోని అంశాలను అన్ని పక్షాలు పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించే అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై కూడా ఇరువురు నాయకులు చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై భవిష్యత్తులోనూ సమన్వయం, సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com