డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో టేలర్ పై విచారణ..!!

- August 07, 2026 , by Maagulf
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో టేలర్ పై విచారణ..!!

మనామా: డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాతో సంబంధాలు పెట్టుకుని మాదకద్రవ్యాల పంపిణీలో పాల్గొన్నాడనే ఆరోపణలపై ఓ టేలర్ పై బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆగస్టు 11న తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు ప్రకటించింది.

పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు, ఓ ప్రాంతంలో 'డెడ్ డ్రాప్' పద్ధతిలో మాదకద్రవ్యాలను దాచిపెట్టి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో భద్రతా అధికారులు నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా సాయంత్రం సమయంలో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ రోడ్డుపక్కన ఓ వస్తువును దాచేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడిని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతడు దాచిన గాజు సీసాలో సుమారు 41.70 గ్రాముల ద్రవరూప మాదకద్రవ్యం లభించింది.

అనంతరం నిందితుడి వద్ద నిర్వహించిన తనిఖీలో అదే తరహా ద్రవరూప మాదకద్రవ్యంతో నింపిన 29 కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు 413.52 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దర్యాప్తులో ఈ కేసు బహ్రెయిన్‌లోకి మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను అక్రమంగా తరలించి విక్రయించే సంఘటిత ముఠాతో సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. నిందితుడు డ్రగ్స్‌ను స్వీకరించడం, నిల్వ చేయడం, చిన్న చిన్న భాగాలుగా విభజించి డబ్బు కోసం పంపిణీ చేయడం వంటి బాధ్యతలు నిర్వహించినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com