హౌతీ దాడుల్లో నజ్రాన్‌లో 11 మంది పౌరులకు గాయాలు..!!
- August 07, 2026
రియాద్: యెమెన్‌లోని హౌతీ మిలీషియా జరిపిన దాడుల్లో సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతమైన నజ్రాన్‌లో 11 మంది పౌరులు గాయపడినట్లు యెమెన్‌లో చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతుగా ఏర్పాటైన కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికీ శుక్రవారం వెల్లడించారు. గాయపడిన వారిలో ఏడుగురు సౌదీ పౌరులు ఉన్నారు. వీరిలో ఒక మహిళ, నాలుగేళ్ల చిన్నారి కూడా ఉన్నారని తెలిపారు. అలాగే ఒక యెమెన్ నివాసి, ఇద్దరు ఈజిప్టు వాసులు, ఒక పాకిస్థాన్ నివాసి కూడా గాయపడినట్లు పేర్కొన్నారు.
హౌతీ మిలీషియా పౌర లక్ష్యాలపై విచక్షణారహితంగా ఈ దాడులకు పాల్పడిందన్నారు. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టాలను, వాటి సాంప్రదాయ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇలాంటి ఉగ్రదాడులను అడ్డుకునేందుకు, పౌరుల భద్రతను కాపాడేందుకు కూటమి సంయుక్త దళాలు అవసరమైన నిరోధక చర్యలను కొనసాగిస్తాయని మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్లోనే మ్యారేజ్ కాంట్రాక్ట్ నమోదు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!!
- మెటాకు 567 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన న్యూమెక్సికో కోర్టు
- హౌతీ దాడుల్లో నజ్రాన్‌లో 11 మంది పౌరులకు గాయాలు..!!
- ధోఫార్‌లో ‘లైఫ్ ఆఫ్టర్ లైఫ్’ అవగాహన ప్రచారం ప్రారంభం..!!
- ఫోర్బ్స్ టాప్-100 సీఈఓల జాబితాలో ఖతార్ కార్పొరేట్ దిగ్గజాలు వీరే..!!
- డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో టేలర్ పై విచారణ..!!
- 5 మిలియన్ డాలర్ల మానవతా సాయం ప్రకటించిన కువైట్..!!
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్‌లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం







