యూఏఈలో ఆన్లైన్లోనే మ్యారేజ్ కాంట్రాక్ట్ నమోదు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!!
- August 07, 2026
అబుదాబి: యూఏఈలో వివాహం చేసుకోదలిచిన కపుల్స్ ఇకపై న్యాయ మంత్రిత్వ శాఖ (Ministry of Justice) రూపొందించిన ఎలక్ట్రానిక్ మ్యారేజ్ కాంట్రాక్ట్స్ సిస్టమ్ ద్వారా వివాహ ఒప్పందం (Marriage Contract) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డిజిటల్ సేవ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఫెడరల్ షరియా కోర్టుల్లో అందుబాటులోకి వచ్చింది.
ఈ స్మార్ట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా దరఖాస్తు సమర్పించడం, వివాహాధికారితో (Marriage Officiant) అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, ఫీజులు ఆన్లైన్లో చెల్లించడం, ఆమోదం పొందిన వివాహ ఒప్పందం డిజిటల్ కాపీని ఈ-మెయిల్ ద్వారా స్వీకరించడం వంటి అన్ని సేవలను ఒకే వేదికపై పూర్తి చేయవచ్చు. అలాగే వివాహాధికారులు కూడా స్మార్ట్ పరికరాల ద్వారానే ప్రక్రియను పూర్తి చేయగలిగేలా వ్యవస్థను రూపొందించారు.
దరఖాస్తు విధానం
వివాహ ఒప్పందం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఈ దశలను అనుసరించాలి.
* న్యాయ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లోకి వెళ్లాలి.
* Electronic Marriage Contracts Systemను ఎంచుకోవాలి.
* UAE Pass ద్వారా లాగిన్ కావాలి.
* వివాహ ఒప్పందం రకాన్ని ఎంపిక చేసుకోవాలి.
* వధూవరులు, సాక్షులు తదితర వివరాలను నమోదు చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
* దరఖాస్తు సమర్పించి సేవా రుసుము చెల్లించాలి.
ఆ తర్వాత వివాహాధికారి దరఖాస్తును పరిశీలించి సంబంధిత వ్యక్తుల సంతకాలు తీసుకుంటారు. అనంతరం దరఖాస్తును సమీక్షించి న్యాయమూర్తి ఆమోదానికి పంపిస్తారు. ఆమోదం అనంతరం వివాహ ఒప్పందం డిజిటల్ కాపీని భార్యాభర్తలకు ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు.
అవసరమైన పత్రాలు
* ఎమిరేట్స్ ఐడీ
* వైద్య పరీక్ష నివేదిక
ముస్లింలకు:
* దరఖాస్తుదారుడి గుర్తింపు పత్రాలు
* ఇద్దరు సాక్షుల గుర్తింపు పత్రాలు
* అవసరమైన ఇతర ధ్రువపత్రాలు
ముస్లిమేతరులకు:
ఇద్దరు జీవిత భాగస్వాముల గుర్తింపు పత్రాలు
* అవసరమైతే సంబంధిత రాయబార కార్యాలయం నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (NOC)
* వైద్య పరీక్ష ధ్రువపత్రం
* జన్యు పరీక్ష (Genetic Screening) ధ్రువపత్రం
ముస్లిమేతరుల సివిల్ మ్యారేజ్‌కు అర్హత
సివిల్ మ్యారేజ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఈ నిబంధనలను పాటించాలి.
* ఇద్దరి వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి.
* వివాహం పురుషుడు-మహిళ మధ్య మాత్రమే జరగాలి.
* ఇద్దరికీ చట్టబద్ధంగా వివాహం చేసుకునే అర్హత ఉండాలి.
* ఇద్దరు సోదరీమణులను ఒకేసారి వివాహం చేసుకోవడం నిషేధం.
* వధువు ఇప్పటికే మరొక వివాహ బంధంలో ఉండకూడదు.
ఫీజు
వివాహ ఒప్పందం దరఖాస్తు సమర్పణకు 50 దిర్హమ్లు ఫెడరల్ సేవా రుసుముగా నిర్ణయించినట్లు యూఏఈ న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ సమగ్ర డిజిటల్ వ్యవస్థ ద్వారా దరఖాస్తు నుంచి తుది ఆమోదం వరకు మొత్తం వివాహ ఒప్పంద ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోనే పూర్తి చేసుకునే అవకాశం కల్పించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్లోనే మ్యారేజ్ కాంట్రాక్ట్ నమోదు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!!
- మెటాకు 567 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన న్యూమెక్సికో కోర్టు
- హౌతీ దాడుల్లో నజ్రాన్‌లో 11 మంది పౌరులకు గాయాలు..!!
- ధోఫార్‌లో ‘లైఫ్ ఆఫ్టర్ లైఫ్’ అవగాహన ప్రచారం ప్రారంభం..!!
- ఫోర్బ్స్ టాప్-100 సీఈఓల జాబితాలో ఖతార్ కార్పొరేట్ దిగ్గజాలు వీరే..!!
- డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో టేలర్ పై విచారణ..!!
- 5 మిలియన్ డాలర్ల మానవతా సాయం ప్రకటించిన కువైట్..!!
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్‌లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం







