ఒలింపిక్స్ మైదానాల్లో కార్చిచ్చు కలకలం..
- August 15, 2016
ఒలింపిక్స్ మైదానాల్లో కార్చిచ్చు కలకలం రేపింది. ఒలింపిక్ హాకీ మైదానంలోకి కార్చిచ్చు బూడిద వ్యాపించడంతో అక్కడే ఉన్న అథ్లెట్లను, బీఎంఎక్స్ కేంద్రాన్ని ఖాళీ చేయించారు. సోమవారం మధ్యాహ్నం రియోలో ఉష్ణోగ్రత భారీగా పెరగటంతో కార్చిచ్చు ఏర్పడింది. దీంతో హాకీ మైదానం, ఎక్స్పార్క్, ది కెనోయి స్లాలోమ్, బీఎంఎక్స్, మౌంటేన్ బైకింగ్ ఈవెంట్లు జరిగే ప్రదేశాలను ఖాళీ చేయించారు.అగ్నికి ఆజ్యం పోసినట్లు దీనికి గాలికూడా తోడవడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. గాలుల కారణంగా ఒలింపిక్ పార్క్లో కెమెరా కూలిపోయిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు.ఫీల్డ్హాకీ స్టేడియంలో బూడిద పడుతున్న సమయంలో అమెరికా జర్మనీ జట్లమధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో అమెరికా విజయం సాధించింది.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







