దుబాయ్ లో... హత్యలకు మరణశిక్షలే జవాబు

- August 15, 2016 , by Maagulf
దుబాయ్ లో...  హత్యలకు  మరణశిక్షలే జవాబు

  ఆగస్టు 15 , 2016:  జోర్దానియన్  బాలుడు యాభైదా  సిదేకీ ను కిడ్నప్ చేయడం ఆపై ఆత్యాచారం , హత్య నేరంపై 49 ఏళ్ల జోర్దానియా దేశసస్థుడైన   నోడల్  ఈసా  అబ్దుల్లా కు  మరణశిక్ష  విధించారు. 

ఫిబ్రవరి 24: అల్జీరియన్ వ్యాపారవేత్త ( 35 )  వ్యూహాత్మకంగా ఒక భవనం యొక్క ఎలివేటర్ లోపల ప్రవేశించి  ఒక చైనీస్ అకౌంటెంట్ ని  కత్తిపోట్లు పొడిచి చంపి  అతని వద్ద నుండి 1.02 మిలియన్  డి హెచ్  లని ఆ వ్యక్తి నుంచి దొంగిలించిన నేరానికి మరణశిక్షను పొందాడు. 

డిసెంబర్ 21, 2015: భారతీయుడైన ఒక భర్త మరియు అతని పాకిస్తానీ స్నేహితునితో కల్సి తన  మాజీ భార్యని  చంపినందుకు మరణశిక్ష విధించింది. ఆమె తన భర్తకు ఒక పాకిస్థానీయురా లైన మహిళలతో తన భర్తకి వివాహేతర సంబంధం  ఉందనే ఆరోపణలు చేసినందుకే వారు ఇరువురు కల్సి  ఆమెను దారుణంగా హతమార్చారు. 

అక్టోబర్ 22: ఒక పాకిస్తానీ నిర్మాణ కూలీ ( 32 ) పెట్రోల్ తో తన  సహచర కార్మికుని పెట్రోలు పోసి నిప్పంటించాడు ఈ నేరంలో  పాకిస్తానీ నిర్మాణ కూలీ కి  మరణశిక్ష విధింపడింది. 

మే 4: ఒక ఆఫ్ఘన్ కార్మికుడు ఒక సంపన్న ఇరాకీ వ్యాపారవేత్తని  ప్రణాళిక ప్రకారం హత్య చేసినందుకు మరణశిక్ష విధించారు.

ఆగస్టు 23, 2014: ఒక టెక్నీషియన్ బాస్ తిట్టినందుకు  ఒక గిడ్డంగిలో ఆయనపై కత్తితో దాడి చేసి హతమార్చాడు.  మరియు అతని నుండి 172,000 డి హెచ్  దొంగిలించాడని ఆరోపణ నిరూపితమైన నేపథ్యంలో  దోషి కాబడిన టెక్నీషియన్ కు  మరణశిక్ష విధించారు.

మార్చి 9: పాకిస్తాన్ సందర్శకుడు  హెరాయిన్ 4 కిలోల అమ్మకం జరిపినందుకు  మరణశిక్ష విధించారు.
జనవరి 15: ఒక 28 ఏళ్ల నేపాలీ వ్యక్తి  తన వద్ద అప్పు తీసుకొన్న తన స్నేహితుదీని 8,500 డి హెచ్ తిరిగి చెల్లించలేదని గొంతు పిసికి చంపినందుకు నేపాలీ వ్యక్తికి మరణశిక్ష విధించారు.

యౌవన 27, 2013: పాఠశాల నుండి తిరిగి వచ్చే కుమారుడు కోసం  ఒంటరిగా  వేచి ఉన్న ఓ మహిళ ని గమనించిన  8 ఏళ్ల భారతీయ అకౌంటెంట్ ఆమె  ఇంట్లో ప్రవేశించి ఒక మహిళ గొంతు కోసి దారుణంగా హతమార్చాడు ఆపై ఆమె ఆభరణాలు దొంగిలించిన నేరంలో ఆ వ్యక్తికి  మరణశిక్ష విధించారు. 

మార్చి 27: తనని " క్రేజీ " ( పిచ్చిది ) తన  సహ ఉద్యోగిని ఎగతాళి చేసినందుకు  ఒక 28 ఏళ్ల ఇథియోపియన్ పనిమనిషి, సాటి పని మనిషిని  35 సార్లు కత్తితో పోట్లు పొడిచింది. ఆ తర్వాత  ఒక మాంసం శుభ్రం చేసే కత్తితో తన గొంతు కోసుకునేందుకు  ప్రయత్నించారు.  ఆమెకి కోర్టు మరణశిక్ష విధించింది.

మార్చి 25: ఒక 29 ఏళ్ల పాకిస్తానీ మనిషి ఒక వేశ్య యొక్క మెడ పిసికి చంపి ఆమె డబ్బు మరియు మొబైల్ ఫోన్లు దొంగిలించిన ఆ వ్యక్తికి మరణశిక్ష విధించారు.

ఫిబ్రవరి 8, 2012: బాంగ్లాదేశ్ వ్యక్తి ( 23 )  ప్రణాళిక ప్రకారం ఒకరిపై దొంగతనం, హత్య కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో మరణ శిక్ష విధించారు.

జనవరి 24, 2011: ఈజిప్షియన్ సందర్శకుడు,  ప్రణాళిక ప్రకారం తన స్వదేశయుడిని చంపి  హతుని  క్రెడిట్ కార్డు దొంగిలించి హత్య చేసినందుకు  మరణశిక్ష విధించారు.

సెప్టెంబర్ 20, 2010: 23 ఏళ్ల శ్రీలంక వ్యక్తి తన ప్రియురాలి భర్తని  హత్య చేసినట్లుగా  దోషిగా తేలడంతో  ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించారు.

జూన్ 7:  ఈద్ అల్ అధా పండుగ  మొదటి రోజున మసీదు యొక్క వాష్రూమ్ లో నాలుగేళ్ల బాలుడుని అత్యాచారం చేసి చంపినందుకు 30 ఏళ్ల ఎమిరేట్ వ్యక్తికి  శిక్ష విధించారు  

జనవరి 26:  ఒక ఎగ్జిక్యూటివ్ ని  ప్రణాళిక ప్రకారం హత్య చేసిన  ఇద్దరు భారతీయ వ్యక్తులు ఆయన సూట్ కేసు ను దొంగలించి కారు లోనే  మృతశరీరం వదిలి పారిపోతూ పారిపోతుండగా పోలీసులకు దొరకడంతో వారుఇరువురికి  మరణ శిక్ష విధించబడింది..
   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com