ఖతార్ ఎయిర్‌వేస్ పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్..ప్రయాణికులకు హెచ్చరిక..!!

- August 10, 2026 , by Maagulf
ఖతార్ ఎయిర్‌వేస్ పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్..ప్రయాణికులకు హెచ్చరిక..!!

దోహా: ఖతార్ ఎయిర్‌వేస్ పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తూ ప్రజల నుంచి వ్యక్తిగత, ఆర్థిక వివరాలను సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎయిర్‌లైన్ హెచ్చరించింది. సోషల్ మీడియా, డైరెక్ట్ మెసేజ్‌ల ద్వారా పాస్‌వర్డ్‌లు, వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లు (OTPలు), బ్యాంకింగ్ వివరాలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని తాము ఎప్పుడూ అడగమని ఖతార్ ఎయిర్‌వేస్ స్పష్టం చేసింది.

ఖతార్ ఎయిర్‌వేస్ పేరుతో వచ్చే అనుమానాస్పద సందేశాలు, సోషల్ మీడియా ఖాతాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఖతార్ ఎయిర్‌వేస్‌కు సంబంధించిన సేవలు, సమాచారం కోసం ధృవీకరించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలు లేదా అధికారిక మొబైల్ యాప్‌ ద్వారా మాత్రమే సంప్రదించాలని కోరింది. నకిలీ ఖాతాల బారిన పడకుండా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ప్రయాణికులకు సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com