సమైల్‌లో ఇంధన స్టేషన్‌లో వాహనానికి మంటలు..!!

- August 13, 2026 , by Maagulf
సమైల్‌లో ఇంధన స్టేషన్‌లో వాహనానికి మంటలు..!!

మస్కట్‌: ఒమన్‌లోని సమైల్‌లో అల్‌ మహా పెట్రోలియం ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ కంపెనీకి చెందిన ఇంధన స్టేషన్‌లో ఓ వాహనంలో మంటలు చెలరేగాయి. మంటలు ఇంధన పంప్‌ వరకు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అల్‌ మహా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఇంధన స్టేషన్‌ ప్రాంగణంలో క్లీనింగ్ పనులు కొనసాగుతున్నాయని సంస్థ పేర్కొంది. ఘటన కారణంగా జరిగిన నష్టంపై పూర్తి స్థాయి అంచనా వేస్తున్నట్లు తెలిపింది. స్టేషన్‌లో కార్యకలాపాలను సురక్షితంగా పునఃప్రారంభించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.

వచ్చే కొద్ది రోజుల్లో స్టేషన్‌లో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అల్‌ మహా తెలిపింది. వినియోగదారులు, ఉద్యోగులు, సమాజ భద్రతే తమ సంస్థకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com