ఖతార్‌లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!

- August 13, 2026 , by Maagulf
ఖతార్‌లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!

దోహా: ఖతార్‌లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న నేపథ్యంలో వేసవి పనివేళలకు సంబంధించిన నిబంధనలను యజమానులు, కార్మికులు తప్పనిసరిగా పాటించాలని కార్మిక మంత్రిత్వ శాఖ సూచించింది.  అధిక ఉష్ణోగ్రతలకు నేరుగా గురికాకుండా ఉండేందుకు కార్మికులు వృత్తిపరమైన భద్రతా చర్యలు పాటించాలని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలెత్తే అనారోగ్యాలు, హీట్‌స్ట్రోక్‌ వంటి సమస్యలను నివారించేందుకు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

నిబంధనల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో పనులు ఉదయం 10 గంటలలోపు పూర్తి చేయాలి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నేరుగా ఎండలో పనిచేయడం నిషేధం. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత పనులను ప్రారంభించవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో నిషేధిత పనివేళలను పాటించడం కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత కీలకమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

బహిరంగ ప్రదేశాల్లో పనికి సంబంధించిన ఈ నిబంధనలు జూన్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి సెప్టెంబర్ 15 వరకు అమల్లో ఉంటాయి. వేసవి కాలంలో కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు యజమానులు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ మరోసారి గుర్తుచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com