‘నేను రెడీ’లో ఎంటర్టైన్మెంట్ అదిరిపోతుంది: హీరో హవీష్
- August 13, 2026
యంగ్ హీరో హవీష్ ‘నేను రెడీ’ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది.
సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన రాగా, నర్గీస్ ఫక్రీ ప్రత్యేక పాత్రలో కనిపించిన ఈ పాటలో హవీష్, కావ్య థాపర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అలాగే రెండో సింగిల్ ‘మెరుపులే మెరుపులే’ కూడా యూత్‌ను ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ మూడో సింగిల్ ‘మస్తుగుందిరా యవ్వారం’ను విడుదల చేశారు.
లైవ్లీ ఫోక్ బీట్స్‌ను క్యాచీ పాప్ సౌండ్స్‌తో కలిపి రూపొందించిన ఈ పాట మొదటి నుంచే ఎనర్జిటిక్ వైబ్‌ను క్రియేట్ చేస్తుంది. మిక్కీ జే. మేయర్ స్వరపరిచిన ఈ పాటలో డ్రమ్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, ఆధునిక సింథ్స్, హుక్స్ను చక్కగా మిక్స్ చేశారు. దీంతో పాటకు ఫుల్ ఎనర్జీతో కూడిన కమర్షియల్ టచ్ వచ్చింది.
కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం యూత్‌ఫుల్‌గా, సరదాగా, ఫ్లర్టీగా సాగుతూ ప్రేమ, యవ్వనం, యాటిట్యూడ్‌ను ప్రజెంట్ చేస్తోంది. అనురాగ్ కులకర్ణి, మానసి ఎరబతినీ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు.
విజయ్ పోలాకి కొరియోగ్రఫీ పాటకు మరో హైలైట్‌గా నిలిచింది. మాస్ కమర్షియల్ డ్యాన్స్ స్టెప్స్‌ను ఫోక్ ఫ్యూజన్ మూవ్‌మెంట్స్‌తో మిక్స్ చేసి హై ఎనర్జీతో రూపొందించారు. హవీష్, కావ్య థాపర్ కూడా తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఎనర్జీ పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
‘నేను రెడీ’లో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి కామెడీ, ఎంటర్టైన్మెంట్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనుంది.
మిక్కీ జే. మేయర్ సంగీతం అందిస్తుండగా, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, విక్రాంత్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు.
వరుసగా విడుదలవుతున్న పాటలకు మంచి స్పందన వస్తుండటంతో ‘నేను రెడీ’ పై ఆసక్తి పెరుగుతోంది. త్వరలోనే సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.
సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో హవీష్ మాట్లాడుతూ: హలో వరంగల్. మీరు ఇచ్చిన ఆదరణ మాకు గొప్ప కిక్ ఇచ్చింది. ఈ కిక్ కోసం మళ్లీ మళ్లీ వస్తాం. మా పాటలన్నీ మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. కావ్య థాపర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. థియేటర్లలో ఈ సాంగ్ అదిరిపోతుంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ కూడా అద్భుతంగా చేశారు. మిక్కీ జే. మేయర్ గారు పాటలన్నీ అద్భుతంగా చేశారు. ఇప్పటివరకు సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్లు, పాటల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. మిక్కీ గారు, త్రినాథ్ గారి కాంబినేషన్లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో రోహిణి గారు, వెన్నెల కిషోర్ గారి కామెడీ అదిరిపోతుంది. అలాగే బ్రహ్మానందం గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంది. ఈ వేడుకలో మీ రియాక్షన్ చూస్తుంటే సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని ముందే అర్థమవుతోంది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన మాట్లాడుతూ: హాయ్ హన్మకొండ. ముందుగా మా హీరోయిన్‌కి థాంక్యూ. తను నెక్స్ట్ టైమ్ తెలుగులో మాట్లాడాలి. యష్ మాస్టర్ అదరగొట్టారు. మా రైటర్ అద్భుతమైన కథ, డైలాగ్స్ ఇచ్చారు. మా హీరో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పాటకు మిక్కీ గారు గొప్ప ట్యూన్ ఇచ్చారు. అలాగే కాసర్ల శ్యామ్ అన్న చక్కని లిరిక్స్ ఇచ్చారు. విజయ్ పోలాకి అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్‌ను పెద్ద హిట్ చేసిన ఆడియన్స్‌కి థాంక్యూ. ఈ సినిమాని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
కావ్య థాపర్ మాట్లాడుతూ: “అందరికీ థాంక్యూ. ముందుగా మా డైరెక్టర్ గారికి లవ్. ఇందులోని పాటలన్నింటినీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఈ సినిమాని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.”
ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ: “ఈ వేడుకను హన్మకొండలో నిర్వహించడం ఆనందంగా ఉంది. ఇందులోని పాటలన్నీ అందరికీ నచ్చేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ కూడా ఇక్కడే చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ.
యష్ మాస్టర్ మాట్లాడుతూ: “ఇందులోని అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. సినిమా మ్యూజికల్ రైడ్‌లా ఉంటుంది. ఈ సాంగ్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారు. అందరూ ఈ సినిమాని థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.
నటీనటులు: హవీష్, కావ్య థాపర్, నర్గీస్ ఫక్రీ (స్పెషల్ సాంగ్), బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలం, సత్యనారాయణ, రోహన్ రాయ్
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు
బ్యానర్: హార్నిక్స్ ఇండియా LLP
DOP: నిజార్ షఫీ
సంగీతం: మిక్కీ జె మేయర్
కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
యాక్షన్: రామకృష్ణ
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్‌లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







