విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..

- August 13, 2026 , by Maagulf
విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకునే భక్తులకు పౌర విమానయాన శాఖ సంతోషకరమైన వార్త అందించింది. విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి పుణ్యక్షేత్రం వారణాసి(Vijayawada Varanasi Direct Flight)కి నేరుగా నూతన ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని విస్తరించడంతో పాటు భక్తులకు కాశీ యాత్రను మరింత సులభతరం చేసేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

వారానికి మూడు రోజులు సర్వీసులు:
ఈ నూతన విమాన సర్వీసులు వారంలో మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతివారం మంగళ, గురు, శనివారాల్లో విజయవాడ-వారణాసి నగరాల మధ్య ఈ విమానాలు నడుస్తాయి. దేశంలోని టైర్-2, టైర్-3 నగరాలను ప్రధాన కేంద్రాలతో అనుసంధానించడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈ సర్వీసు ద్వారా సుదీర్ఘ ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఆధ్యాత్మిక పర్యాటకం విశేషంగా పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

త్వరలోనే సీ ప్లేన్ ప్రాజెక్ట్, ఏపీలో పర్యాటక విప్లవం:
విమాన కనెక్టివిటీ పెంపుతో పాటు రాష్ట్రంలో వాటర్ ఏవియేషన్‌ను ప్రోత్సహించేందుకు పౌర విమానయాన శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా హుస్సేన్ సాగర్, ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం జలాశయాల మధ్య “సీ ప్లేన్” ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు మరియు ఇండిగో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com